MENU

సాక్ష్యము

ఆరాధన స్తుతిసైన్యం సమర్పించు నా ఆరాధన యేసయ్యకే మరియు ఎత్తుకో యేసయ్య అను పాటల క్యాసెట్టులను విడుదల చేయుటకు దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవునుకి వందనాలు చెల్లిస్థున్నాను.

నా పాతపేరు శ్రీను ఇప్పుడు దేవుడు సముయేలు గానన్ను మార్చుకున్నాడు. పాత జీవితము నా జీవితము చాలా దౌడ్భాగ్యమైన జీవితము, నీచ జీవితము. ఇలాంటి జీవతములో జీవిస్తున్నప్పుడు దేవుడు నన్ను చూచాడు.

చిన్నప్పుడు దొంగతనాలు చేయటము, మోసాలు చేయటము, అబద్దాలు మట్లాడటము నాకు అలవాట యిపోయినవి ఇలాంటి జీవితములో జీవిస్తున్నప్పుడు నా తల్లి ఒక రోజు నన్ను చాలా గట్టిగా కొట్టడం జరిగింది. అప్పుడు నేను బయటికి వచ్చేసి సుమారు నేను 15 సంవత్సరాలు నేను ప్రతీ ఊరిలో కూడా డబ్బులు దండుకుంటూ, అబద్దాలాడుతూ, మోసాలు చేస్తూ నాజీవితాన్ని గడిపేవాడిని ఇప్పుడు తన పరిశుద్దరక్తములో కడిగి, నా పాపములన్ని కడిగి శుద్ది చేసి ఈ రోజు ఆయన పాత్రగా వాడుకుంటున్నాడు. ఈ పదిహే ను సంవత్సరాలు సుమారు నేను తిరిగిన ఊళ్ళు ఎనిమిదివేలు పైగానే ఎనిమిదివేల ఊళ్ళలో కూడా అబద్దాలాడుతూ, మోసాలు చేస్తూ తిరుగుతున్నాను ఏ ఊళ్ళో అయితే నేను మొసాలు చేసానో,యే గ్రామములో అయితే నేను మోసాలు చేసానో, యే పట్టణాలలో అయితే నేను మోసాలు చేసానో అదే ఊళ్ళో ఇప్పుడు ఈ రోజు ఆ దేవాతి దేవుడు యేసయ్య ఈ పనికిమాలిన పాత్రను పనికొచ్చే పాత్రగా చేసి ఆయన ప్రజలమధ్యన వాడుకుంటున్నాడు. ఇది దేవునికే మహిమ ఈ పాటలక్యాసెట్లు వింటున్న మీకు అలాగే ఈ వెబ్ సైట్ ను సందర్శిస్తున్నా మీకు శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత ఆ దేవాతి దేవుడు దయ చేయునుగాక ఆమేన్. !

ఆలోచించడానికి మీకు సమయం ఉందా?

గత 2 వేల సం||రాలుగా యేసుక్రీస్తు సువార్త వాక్యం ప్రకటింపబడుతున్నది. అనేకమంది సువార్తీకులు, మిషనరీలు, చర్చీలు సువార్తను ప్రకటిస్తున్నట్లు చెపుతున్నారు. వీరేమో మానవులను ఎలాగైనా రక్షించాలని శతవిధాల ప్రయత్నిస్తూ ప్రాకులాడుతున్నారు. వీరి ఉద్ధేశంలో యేసుక్రీస్తుకి సాతానుకి మధ్య పోరాటం జరుగుతుంది. ఎలాగంటే యేసుక్రీస్తేమో ఈ ప్రపంచానంతటిని రక్షించాలని సాతానేమో వారిని నరక పాత్రులను చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాని ఈ పోటిలో సాతానే గెలుస్తున్నట్లు కనబడుతున్నది. మరి వీరు ప్రకటిస్తున్నది నిజమైన సువార్తేనా? ఇంతకి యేసుక్రీస్తు ఈ ప్రపంచానంతటిని ఇప్పుడే రక్షించాలి అనుకుంటున్నాడా? అసలు మానవులెందుకు రక్షించబడాలి? కనుక మనం సమయం కేటాయించి మన బైబిల్ ని చదవాలి. కేవలం చదవడం కాదు study చెయ్యాలి.

11.29.2011

BIBLE STUDY

 • ఎజ్రా గ్రంథం 
 • అధ్యాయాలు : 10, వచనములు : 280 
 • రచించిన తేది, కాలం : క్రీ.పూ. 457-444 సం||లో ఈ గ్రంధం వ్రాయబడింది.
 • మూల వాక్యాలు: 3:11 “వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరి...
   యోబు గ్రంథం
  • అధ్యాయాలు : 42, వచనములు : 1070
   గ్రంథకర్త : ఎవరో తెలియదు.
   రచించిన తేది : దాదాపు 1800-1500 సం. క్రీ.పూ
   మూల వాక్యాలు : 1:21
   రచించిన ఉద్ధేశం: బైబెల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలలో యోబు గ్రంథం ప్రత్యేకమైనది. ఈ గ్రంథంలో ఓ చక్కటి తత్...
   ఎస్తేరు గ్రంథం
   అధ్యాయాలు : 10, వచనములు : 167
   గ్రంథకర్త : మొర్దెకైగా (9:29) (రచనా శైలిని తీసికొని ఈ పుస్తకమును ఎజ్రాయో, నెహెమ్యాయో వ్రాసి యుండవచ్చు) రచించిన తేది : దాదాపు 133 సం. క్రీ.పూ
   • మూల వాక్యాలు : 4:14 “నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న య...11.16.2011

చెవులుగలవాడు వినునుగాక

ప్రతిరోజు మనం రోజువారి పనుల్లో నిమగ్నమైపోతాం. టైం ఎలా గడిచిపోయిందో కూడా ఒకోసారి తెలియదు. మనకు మన గురించి ఆలోచించే సమయం దొరకదు. దొరికిన మనం ఏదైనా ఆలోచిస్తాం గాని మన జీవితాలగురించి ఆలోచించడానికి ఇష్టం ఉండదు. దేవుని సంబంధమైన జీవితం గురించియైతే అసలు మనం ద్వేషిస్తాం.

బ్రతుకుదెరువు (అంటే కూడు గూడు మరియు గుడ్డ) అనే పనిలో మన సమయం అంతా గడిచిపోయింది. దానికోసం నిత్యం రకరకాల పనులు చేస్తుంటాం. అవును చేసుకోవాలి. అది ఎవరు కాదనరు. కాని అందులో పడి అసలు జీవించడం అంటే ఏమిటో మరిచిపోతున్నారేమో గమనించుకోవాలి. ఎలా బ్రతకాలా? అని ఆలోచిస్తారు. మంచిదే! కాని అది మన భౌతిక జీవితం ఉన్నంతవరకు మాత్రమే పనికొస్తుంది. కాని నీవు మరణిస్తే ఏమౌతుంది? మరి దేనికింత ప్రాకులాట?

మరణం తరువాత

మరణించిన తరువాత మన ఆలోచనలు, మనకు దేనికి పనికిరావు. గమనించండి! మనం సిద్దంగా ఉన్నా లేకపోయినా ఒకనొక రోజున మనకు అన్ని అంతమైపోతాయి. ఇంక సూర్యోదయము, సూర్యస్తమయము రోజులు, గంటలు అనేవి మనకు ఉండవు. నీవు సంపాదించినవన్ని అవి నీకు గుర్తున్నా లేకపోయినా వేరేవాళ్లకు వెళ్లిపోతాయి. నీ అస్థి, గొప్పదనము, బలము అన్ని అనవసరమైపోతాయి. నీ కోపాలు, ఆవేశాలు, నిట్టూర్పులు, కక్షలు అన్ని మాయమైపోతాయి. అలాగే నీ ఆశలు, ఆశయాలు, ప్రణాళిలు అన్ని నిరుపయోగం అయిపోతాయి. ఒక్కప్పుడు నీకు ఎంతో విలువ అనిపించిన విజయాలు, ఓటములు గాలిలో కలిసిపోతాయి. నీ వంశం ఎలాంటిది, ఎంత బాగా బతికావు, ఎంత గొప్పవారితో జీవించావు అనేవి అన్ని వ్యర్ధమే. నీవు అందగాడివా, మేధావివా, పురుషుడువా, స్త్రీవా, మంచి చర్మపు రంగు గలవాడివా అనేవన్ని అప్రస్తుతమైపోతాయి.

ఎప్పుడైనా ఆలోచించారా? యేసుక్రీస్తు, చర్చీలు, దేవుని వాక్యం, ప్రార్ధనా సభలు దైవసేవకులు మొదలైనవన్ని చెప్పేది లేదా బోధించేది దేనిగురించి? బ్రతుకుదెరువు గురించేనా? కాదు. ఈ బ్రతుకు తరువాత వచ్చే జీవితం గురించి అవి బోధిస్తున్నాయి. దేవుడు నిత్యజీవమును యేసుక్రీస్తునందు మనకు వాగ్దానము చేసినాడు. “అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము. ”(రోమా 6:22,23). చాలామంది బ్రతుకుదెరువు గురించి మాత్రమే దేవుని సేవ చేస్తున్నారు. వారు వారి జీతం ఖచ్చితంగా పొందుకుంటారు.

ఆ జీవితం గురించి ఈనాడే తెలుసుకొని దానికి అర్హత సాధించటానికి ఈ జీవితంలోనే మనలను మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ జీవితం ప్రస్తుతం మనం జీవించే ఈ జీవితాల మీద ఆధారపడిఉంది. చెవులుగలవాడు వినును గాక!

చెవులుగలవాడు వినును గాక!

11.11.2011

ప్రవక్తయైన దానియేలు దేవుని రాజ్యము గురించి ముందే చెప్పెను

ప్రవక్తయైన దానియేలు దేవుని రాజ్యము గురించి వ్రాశాడు. మొట్టమొదటి ప్రపంచ చక్రవర్తియైన నెబుకద్నెజరు కనిన కలకు దానియేలు భావం తెలియజేసాడు. ఆ యొక్క కలలో ఆ రాజు ఒక ప్రతిమను చూసెను, ఆ కల యొక్క భావం ఈ విధంగా తెలియజేసెను. “ఆ కల 5 ప్రపంచ రాజ్యములను గూర్చి తెలియజేయుచున్నది. మొదటిది కల్దీయుల రాజ్యము (బబులోను రాజ్యము), రెండవది పర్షియ రాజ్యము, మూడవది గ్రీకుమాసిదోనియ రాజ్యము, నాలుగవది రోమా సామ్రాజ్యము, ఇంక ఐదవది దేవుని రాజ్యము. మొదటి నాలుగు రాజ్యాలు అలా వచ్చి పోతాయి కాని  ఐదవ రాజ్యమునకు నశింపులేదు మరియు యుగ యుగములు నిలుచును. “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిం చును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును. (దానియేలు 2:44)”. మొదటి నాలుగు రాజ్యాలు భూసంబంధమైన రాజ్యాలు. కాని ఐదవది దేవుని సంబంధమైనది. దానికి అంతమే ఉండదు. దానిని ఏలువారు పరిశుద్ధులు. “ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను (రాజ్యములను) సూచించుచున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగ యుగములు యుగయుగాంతములవరకు రాజ్యమేలుదురు. (దానియేలు 7: 17,18)”. పరిశుద్ధులు అంటే ఆత్మసంబంధంగా తిరిగి జన్మించిన వారు. “అందుకు యేసు అతనితో - ఒకడు క్రొత్తగాజన్మించితేనే కాని అతడు దేవునిరాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. (యోహాను 3:3)”. అంటే యేసుక్రీస్తు యొక్క రాజ్య సువార్త విని రక్షింపబడి నిత్యజీవం పొందినవారు. వారు యేసుక్రీస్తుతో పాటు రాజ్యాన్ని యుగ యుగములు ఏలుదురు. “.....ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయెను; ఆయన యుగయుగముల పర్యంతము ఏలుననెను. (ప్రకటన 11:15)”.
                కనుక దేవుని రాజ్యము అంటే యేసుక్రీస్తుతో పాటు పరిపాలన చేయు ఆత్మసంబంధముగా తిరిగి జన్మించిన పరిశుధ్ధులు. అంటే దేవుని ప్రధమ ఫలములు. అంటే దేవుని ప్రపంచ ప్రభుత్వము. “నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో(యేసు) కూడ నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. (ప్రకటన 3:21)”. యేసుక్రీస్తు రెండవ రాకతో దేవుని రాజ్యము ఏర్పడుతుంది. ఇదే మొదటి పునరుద్ధానము. దేవుని రాజ్యము ఏర్పడిన మొదటి 1000 సం||రాలు ఈ భుమి మీద పరిపాలన జరుగును. “ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునైయందురు ఇట్టివారిమీద రెండవ మరిణమునకు అధికారములేదు; ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యముచేయుదురు. (ప్రకటన 20:6)”. పాలించేవారేమో యేసుక్రీస్తు మరియు ఆత్మసంబందులు (దేవుని కుటుంబం అంటే తిరిగి జన్మించిన పరిశుద్ధులైన రాజులైన యాజకులు) పాలింపబడేవారేమో మానవులు.
1వ పరిశుద్ధ దినం—పస్కా పండుగ

సంవత్సరంలో ఇదే మొదటి పండుగ. పస్కా అనగా “దాటిపోవుట” అని అర్ధం. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి మహా అద్బుతరీతిగా విడుదల కలుగజేసెను. ఐగుప్తు దేశములో సుమారుగా 400 సంవత్సరాలు ఘోరమైన బానిసత్వమును అనుభవించారు. ఐగుప్తు పాపమునకు సాదృస్యము. దేవుడు అనేక తెగుల్లను ఐగుప్తుయుల మీదకు రప్పించెను. వాటిలో చివరిది మహాభయంకరమైనది. అదేదనగా – “ఐగుప్తుదేశములో నివసించు మనుష్యులలో మరియు జంతువులలో తొలి సంతానమును దేవుని దూత వచ్చి హతము చేయును.”  అయితే ఎవరైతే ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తము ఇంటిద్వారము యొక్క రెండు నిలువుకమ్ముల మీద చల్లుతారో ఆ ఇంటిలోనికి రాకుండా దేవుని సంహారకుడు దాటిపోతాడు. అంతేకా కుండా గొర్రెపిల్ల మాంసమును ఆ రాత్రే అగ్నిచేత కాల్చి మొత్తం భుజించవలెను. దేవుని కృప వలన ఇశ్రాయేలు ప్రజలందరు ఈ విధంగా చేసి దేవుని సంహారకుడు నుండి రక్షించబడినారు.
        పస్కా పండుగ వారి తరతరములు పాటించవలెను. “ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతల కందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను. మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దానినాచరింపవలెను.”  (నిర్గమ 12:12-14).
        యేసుక్రీస్తు పస్కాను క్రమం తప్పకుండా ఆచరించెను. ఆయన మరణమునకు ముందు శిష్యు లతో కూడా పస్కా భోజనమును భుజించెను. ఆ రాత్రి నూతన నిబంధనకు సంబందించి పస్కాను ఎలా ఆచరించాలో క్రమమును తెలియజేసెను. మరుసటి దినము మధ్యాహ్నం 3 గంటలకు సిలువ మీద పస్కా గొర్రెపిల్ల మనందరి కోసం వధింపబడెను. యేసుక్రీస్తు పస్కా పండుగ రోజునే సిలువ మరణం పొందెను. (దేవునివాక్యం ప్రకారం సూర్యాస్తమయం నుండి మరల సూర్యాస్తమయం వరకు ఒక రోజుగా పరిగణించబడుతుంది.) యేసుక్రీస్తు అను మన పస్కా గొర్రెపిల్ల జనులందరి కొరకు వధింపబడెను. “ఇంతేకాక క్రీస్తు అను మన పస్కాపశువు వధింపబడెను.” (1 కొరింథీ 5:7).
        ఎవరైతే పాతనిబంధనలో మాదిరిగా క్రొత్త నిబంధన పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా పాపమునుండి విడుదల పొందుతారో వారు ఈ పస్కా పండుగను మరలా ప్రభువు వచ్చువరకు ఆచరించవలెను. కనుక నిజమైన మారుమనస్సు పొందినవారు మాత్రమే ఈ పస్కా పండుగ ఆచరించుటకు అర్హులు. కనుక ఎవరును అయోగ్యముగా  ప్రభువు యొక్క పస్కాను పాటించకూడదు. “నేను ఈ విషయమై మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి దాని విరిచి - యిది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీని లోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని యీ పాత్ర లోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.”(1 కొరింథీ 11:23-30).
        గమనించండి. ప్రభువు రాత్రిభోజనమన్నా లేదా పస్కా పండుగన్నా ఒక్కటే. కాని రొట్టెవిరుచుట అంటే ప్రభువు రాత్రిభోజనము కాదు అది కేవలం భోజనం చేయడం. పస్కా పండుగను లేదా ప్రభువు రాత్రిభోజనము ఏ రోజున మరియు ఎప్పుడు పాటించవలెను? సంవత్సరానికి ఒకసారి మాత్రమే పస్కా పండుగను ఆచరించవలెను. దేవుని క్యాలండర్ ప్రకారం మొదటి నెలలో 14వ తారీఖున సాయంకాలమున పస్కా పండుగ ఆచరించవలెను. “మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.”(లేవి 23:5). 


క్రిస్మస్ రహస్యం
ప్రపంచంలో ఎక్కువమంది ఆచరించు పండు గ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనా అని అర్ధం. డిసెం బర్ 25న క్రీస్తు పుట్టినరోజుగా క్రిస్మస్ ఆచరిస్తా రు. మొట్టమొదటి సారిగా క్రిస్మస్ అను మాట క్రీ.శ. 1038లో ప్రాచీన ఇంగ్లీషులో కనుగొనబడింది. అయితే యేసు క్రీస్తు నిజంగా డిసెంబర్ 25న జన్మించాడా? సర్వశక్తిమంతుడైన దేవుడు క్రిస్మస్ అను పండుగను ఆచరించమని ఆజ్ఞాపించినాడా? మరి దేవుని వాక్యం ఏమి చెపుతుంది?
చరిత్ర ప్రకారం క్రీస్తు మరణించిన తరువాత 300 సంవత్సరాల వరకు క్రైస్తవులు చాలా తక్కువ సంఖ్యలో ఉండి చాలా శ్రమలకు హింసలకు గురిఅయి నారు. అనేక ప్రభుత్వాల చేత హింసింపబడినారు. అయితే క్రీ.శ. 313 లో "కాన్ స్టాన్ టైన్" అనే రోమా చక్ర వర్తి క్రైస్తవ మతమును అంగీకరించిట వలన క్రైస్తవుల పరిస్థితి మారిపోయింది. ఈ చక్రవర్తి కాలం నుండి క్రైస్తవ్యము పెద్ద ఎత్తున పాశ్యత్య దేశాలలోకి పాకిపో యింది. స్థిరపడి పోయింది. "కాన్ స్టాన్ టైన్" కు ముందు వందల సం|రాల క్రితం నుండి రోమా సామ్రాజ్యము వారి మత పండుగలు ఆచరించేవారు. వారి మతంలో (బబులోను మతం) డిసెంబర్ 17-23 వరకు సాటర్నలియా(SATURNALIA) అనే పండుగను ఆచరించేవారు. ఈ పండుగలో ఒకరికొకరు కానుకలు(గిఫ్టులు) ఇచ్చుకొని సంతోషించేవారు. తరువాత డిసెంబర్ 25న మిత్రా(MITHRA) అనే పేరుగల దేవుని జన్మదిన పండుగ ను ఆచరించేవారు. మిత్రా అంతే నీతిమంతుడైన సూర్య భగవానుడు అని వారి అర్ధం. అంతేకాకుండా రోమియుల నూతన సంవత్సరం పండుగ (జనువరి 1) ఆచరించేవారు. ఆ దినమున గృహాలు దీపాలతో అలంకరించుకొని గిఫ్టులు ఇచ్చి పుచ్చుకొనేవారు(Encyclopedia Brtanica).ఇప్పటికి ఆచరింస్తున్నది ఈ పండుగే.
             రోమా సామ్రాజ్యము క్రైస్తవ్యమును అంగీకరించక మునుపు రోమామతం(బబులోను మర్మపు మతం) ఈ పండుగలను ఆచరించేవారు. ఈ పండగలు క్రైస్తవ్యములో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర పండుగలుగా మార్చబడినాయి. ఈవిధంగా సూర్య భగవానుడు లేదా మిత్రా అను రోమా మత దేవుని జన్మదినం, డిసెంబర్ 25న క్రీస్తు ఆరాధనకు అంటే క్రిస్మస్ గా మార్చబడినది. ముందుగా తెలిపినట్లు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకొనె సాంప్రదాయం క్రీస్తు కంటే ముందుగానే ఉన్నది. అయితే తూర్పుదేశపు జ్ఞానులు రాజును దర్శించడానికి వచ్చారు కనుక కానుకలు తెచ్చారు. అయితే ఇది ఇచ్చిపుచ్చుకొనె సందర్బం కాదు. కేవలం సమర్పించారు కాని పుచ్చుకొనలేదు. మరి శాంతక్లస్ లేదా St. నికోలస్ లేదా క్రిస్మస్ తాత మాటేమిటి? క్రిస్మస్ తాత రోమా మతంలో ఉన్న నిమ్రోదు అనే వ్యక్తి. ఇతని గురించి వివిధ ప్రాంతాలలో వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నయి. "నికోలాయితుల బోధను క్రీస్తు ద్వేషించాడు"( ప్రకటన 2:15 ). ఆ బోధ క్రిస్మస్ తాతకు సంభందించిన బోధ.
        క్రిస్మస్ పండుగను ఆచరించువారు ఎన్నో రకరకాల కారణాలు చెపుతారు. " మేము డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినాన్ని గుర్తుచేసుకొని ఆరాధిస్తన్నాం" అని కొందరంటే " క్రీస్తు సువార్త ప్రకటించటానికి ఈ రోజును ఉపయోగిస్తున్నాం. మేము కేవలం క్రీస్తు జన్మదినాన్ని గౌరవిస్తున్నాం" మరికొందరు సాకులు చెపుతారు.

యేసు క్రీస్తు నిజంగా డిసెంబర్ 25న జన్మించ లేదు. అసలు ఏ రోజున జన్మించాడో దేవుని వాక్యంలో లేదు. చరిత్రలో కూదా లేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. యేసు క్రీస్తు తన జన్మదినమును పండుగ లాగా ఆచరించమని ఆజ్ఞాపించనూ లేదు. యేసు క్రీస్తు మొదటి శిష్యులు ఆచరించినట్లు దేవుని వాక్యంలో లేదు. క్రీస్తు తన మరణ దినాన్ని జ్ఞాపకం(1 కొరింథీ 11:24-27) చేసుకోమన్నాడు (ఇదీ ఈస్టర్ పండుగ కాదు) కాని జన్మదినాన్ని కాదు.         క్రైస్తవులు యేసు క్రీస్తు నియమించిన మరియు ఆచరించమనిన ఆజ్ఞలు, పండుగలు విస్మరించి దేవుడు ఆజ్ఞాపిచనటువంటి వాటిని చేయుచున్నారు. "మనుష్యలు కల్పించిన పద్దతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్దముగా ఆరాధించు చున్నారు (మత్తయి 15:9)". మరియు యేసు ఇలా చెప్పె ను "ప్రభువా ప్రభువా అని నన్నుపిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశింపడు కాని పరలోకమందు న్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును (మత్తయు 7: 21)". కాబట్టి సత్యమును గ్రహించి నిజ దేవుని వైపు తిరిగి సత్యముతో దేవుని ఆరాధించవలెను.


విశ్రాంతిదినమును జ్ఞాపకము చేసుకో....విశ్రాంతిదినం అంటే ఏమిటి? ఎందుకు పాటించాలి? విశ్రాంతిదినం కేవలం యూదులకేనా? క్రైస్తవులకి కూడానా? ఏదో ఒక రోజు పాటిస్తే ఏమైన సమస్య ఉందా? ఇంతకి దేవుని వాక్యం ఏమి చెపుతుంది.      
                    మన మొదటి క్రైస్తవులు ఏ దినమును విశ్రాంతిదినముగా పాటించారు?  వారు యేసు క్రీస్తుతో కలసి జీవించినవారు. యేసు చనిపోయి తిరిగిలేచి ఆరోహనుడైన తరువాత, వారు ఏ రోజున దేవుని ఆరాధించారు? ఏ రోజుని విశ్రాంతిదినంగా ఆచరించారు తెలుసుకొంటే మనం ఈ రోజున ఏలా ఆచరించాలో ఏ రోజున ఆచరించాలో సులభంగా తెలిసిపోతుంది కదా!!!. ఆయా విషయాలన్ని అపోస్తులుల కార్యములు పుస్తకములో చాలా చక్కగా వ్రాయబడినాయి.  

నిజమైన 7వ దినము
                మన మొదటి క్రైస్తవులు ఏ దినమును విశ్రాంతిదినముగా పాటించారు?  వారంలో ఏడవ దినము విశ్రాంతిదినమని దేవునివాక్యం చెపుతుంది. “ఆరు దినములు పనిచేయవలెను; వారములో ఏడవ దినము విశ్రాంతి దినము; అది పరిశుద్ధసంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము.(లేవి 23:3)”.  విశ్రాంతిదినం అంటే ఇప్పుడు శనివారం.  ఎందుకంటే శనివారము తరువాత ఆదివారం వచ్చును.

“విశ్రాంతి దినము గడచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా (మత్తయి 28:1)”.

                అది సరే! కాలక్రమంలో వారంలో దినములు కూడా మారి ఉండవచ్చు ఎవరైన అనుకొవచ్చు. అలా అనుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే వారంలో దినములు కూడా దేవుడే నిర్ణయించాడు. ఏ రోజు మెదటి దినమో మరియు ఏది చివరి దినమో చాలా తేటగా తెలియపరిచాడు.
                గమనించండి. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉండగా వారికి మన్నా అనే ఆహారం ఆకాశమునుండి కురిపించాడు. వారికి వరుసగా ఆరు రోజులు ఆ ఆహారము ఆకాశమునుండు కురియును కాని ఏదవ రోజున మాత్రము అది కురియదు. “ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకక పోయెను. (నిర్గమ 16:26,27)”.  ఆ విధంగా ఏది నిజమైన ఏడవ దినమో మనకు దేవుడే తెలియజేసినాడు. కనుక అందులో ఏమి తప్పు జరుగటానికి ఆస్కారమే లేదు.
వాడుక
                  అది సరే! యేసు తన జీవితకాలములో సమాజ మందిరానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాడు? యేసు చిన్ననాటి నుండి ప్రతి విశ్రాంతిదినమున సమాజ మందిరానికి వెళ్ళడం అలవాటు. “తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను తన వాడుకచొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోకి వెళ్లి చదువుటకై నిలుచుండగా...(లూకా 4:16)”. తన సేవ మొదలుపెట్టిన తర్వాత ప్రతి విశ్రాంతిదినమున ఆయన భోధించాడు “విశ్రాంతిదినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు (లూకా 13:10)”. యేసుక్రీస్తు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడు. ఆయనే దానిని సృష్టించినాడు “అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువై యున్నాడని వారితో చెప్పెను (మార్కు 2;28)”.  
                  యేసుక్రీస్తు చనిపోయి తిరిగి ఆరోహనుడైన తరువాత అపోస్తులుడైన పౌలు యేసునందు విశ్వాసముంచి దేవుని పరిచర్య చేసినాడు. మరి పౌలు ఏ రోజును పాటించాడు? పౌలు కూడా యేసుక్రీస్తు మాదిరిగానే విశ్రాంతిదినమునే పాటించాడు. “గనుక పౌలు తన వాడుకచొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి - క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట అవశ్యమనియు, నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పిచెప్పుచు, వారితో మూడు విశ్రాంతిదినములుతర్కించుచుండెను (అ.కా 17:2,3)”. పౌలు అన్యుల దేశాలలో దేవుని సేవా చేసినాడు. అయినా సరే ప్రతి విశ్రాంతిదినమున మాత్రమే బోధించెను. “అతడు ప్రతి విశ్రాంతిదినమున సామాజమందిరములో తర్కించుచు, యూదులను హెల్లేనీయులను ఒప్పించుచుండెను (అ.కా 18:4)”.
                    ఈ వచనం గమనించండి: “వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి (అ.కా 13:42)”. పౌలుగారు ఈ విధంగా తన బోధను Next విశ్రాంతిదినమున కొనసాగించారు. ఆదివారంలో బోధించినట్లు ఈ ఒక్కచోట వ్రాయబడింది. “ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను (అ.కా 20:7)”. ఇక్కడ సందర్బాన్ని గమనించండి! దేవునివాక్యం ప్రకారం శనివారం సూర్యాస్తమయంతో ఆదివారం మొదలౌతుంది. మరియు ఆదివారం సూర్యాస్తమయంతో సోమవారం మొదలౌతుంది. పౌలు శనివారం సూర్యాస్తమయం దాటి అర్ధరాత్రివరకు (అంటే ఆదివారంలో) ప్రసంగిచాడు. ఆ అర్ధరాత్రి వారితో బోజనం(ఆదివారంలోనే రొట్టే విరిచాడు) చేసాడు. మరలా తన తెల్లవారి వరకు ప్రసంగం కొనసాగించాడు. ఎందుకంటే మరునాడు ఉదయమునే అక్కడ నుండి వెళ్ళనైయున్నాడు. ఇదే వారికి ఆయన చివరి ప్రసంగం. ఆ తర్వాత ఆయన యెరుషలేంలో హతసాక్షి అయినాడు. నిజానికి ఆ యొక్క కూడిక శనివారమే (విశ్రాంతిదినమునే) మొదలైంది కాని అలా కొనసాగించాడు. ఎందుకంటే ఆ యొక్క సందర్బం అలాంటిది.
విశ్రాంతిదినము పాటించటం దేవుని ఆజ్ఞ
                        పది ఆజ్ఞలలో నాల్గవ ఆజ్ఞ “విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము (నిర్గమ 20:8)”.
                        గమనించండి. విశ్రాంతిదినమును జ్ఞాపకమునకు తెచ్చుకోవలెను. ఇది ఎప్పుడో సృష్టించబడింది. అంతేకాని దేవుని పది ఆజ్ఞలలో కొత్తగా చేర్చబడలేదు. దేవుడు మొదటి ఆరు రోజులు ఈ సృష్టికోసం పనిచేసి ఏడవ రోజున విశ్రమించాడు. “దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను (ఆ.కా 2:2)”. మరియు ఏడవ రోజును ఆశీర్వదించి పరిశుద్దపరచాడు. గమనించండి. దేవుడు ఏడవ రోజును ఆశీర్వదించి పరిశుద్దపరచాడు. “కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను (ఆ.కా 2:3)”.            
                        విశ్రాంతిదినము అంటే దేవుని సబ్బాతుదినం. సబ్బాతు అంటే విశ్రాంతి (Rest) అని అర్ధం. ఆనాటి నుండి ఏడవరోజు సృష్టికర్తకు తన ప్రజలకు గుర్తుగా ఉంది. “ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము (నిర్గమ 31:16,17)”.
                        ఇది సలహా కాదు. ఆజ్ఞ. “ఆజ్ఞాతిక్రమమే పాపము (1 యోహాను 3:4)”. ఇది చిన్న విషయం కాదు. క్రైస్తవులు అని చెప్పుకొనే వారు దేవునియందు భయభక్తులు కలిగియుండ వలెను. యేసు చెప్పేను -నేనే మార్గమును సత్యమును జీవమునై యున్నాను.   మరి ఆదివారం ఆరాధనా ఎక్కడనుండి వచ్చింది?
నీవు వ్యర్దముగా ఆరాధిస్తున్నావా?
                    చాలామంది యేసుక్రీస్తు శుక్రవారం మరణించాడని మరియు ఆదివారం పునరుద్ధానము చెందినాడని నమ్ముతారు. అలా అని వాక్యంలో లేదు.(పూర్తి వివరణ కోసం మా అడ్రస్ కు వ్రాయండి). ఈ విధంగా ఆదివారంను ప్రభువుదినముగా చేసుకొని పాటించడం(ఆరాధించడం) జరుగుతుంది. నిజానికి దేవునివాక్యంలో లేదు. కాని రోమన్ క్యాథలిక్ సంఘం మాత్రం విశ్రాంతి దినమును ఆదివారమునకు మార్చి, కొన్ని వందల సంవత్సరాలుగా ఆదివారమునే పాటిస్తు వస్తున్నది. ఆ తరువాత వచ్చిన ప్రొటెస్టెంట్లు కూడా దానినే అనుసరించాయి.
                      మనము ప్రభువును సత్యముతో ఆరాధించవలెను. “దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.(యోహాను 4:24)”. అంతేకాని మనకు ఇష్టమైన రీతిలో ఆయనను ఆరాధించకూడదు. దేవుడు మనకు ఇచ్చిన దేవోపదేశములను మరియు విశ్రాంతి దినములను పాటించవలెను. అంతే అర్ధంలేని 
మానవుల పద్దతులను పాటించకూడదు. అలా చేస్తే మనం ఆయనను వ్యర్ధముగా ఆరాధించిన వారమౌతాము. “అందుకాయన వారితో ఈలాగు చెప్పెను -ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే.(మార్కు 7:6,7)”
                    సాతాను సర్వలోకమును మోసం చేసి దేవునికి దూరం చేసాడు. కాని ఈ విషయంలో మోసపోయం అని అంటే అందులో దేవుని తప్పేంలేదు. ఎందుకంటే “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును (గలతి 6:7)”. సత్యం ఎప్పుడు మనందరికి అందుబాటులోనే ఉంది.
                   విశ్రాంతిదినాన్ని మనందరం జ్ఞాపకం చేసుకొని పరిశుద్దముగా ఆచరించవలెను.